పోలియో రహిత సమాజం కోసం రెండు చుక్కలు

చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌

పల్నాడు జిల్లా: పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అన్నారు. ఆదివారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి పల్నాడు బస్టాండ్‌ వద్ద ఉన్న ఏరియా ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలన్నారు. పోలియో బారిన పడి అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల బాధ తల్లి దండ్రులు కూడా మానసికంగా కుంగి పోతుంటారని అటువంటి పరిస్థితి ఏర్పడ కుండా ఉండాలంటే పోలియో చుక్కలు తప్పనిసరి అని సూచించారు. ఈ కార్య క్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌. బి.రవి. వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నూజెండ్ల: నూజెండ్ల మండల కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ మేడమ్‌ జయరాంరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ పుష్పేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. నిండు జీవితానికి రెండు చుక్కలు అని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకి ప్రతి ఒక్క రికి పోలియో చుక్కలు వేయించుకోవాలని తెలిపారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నివారించాలని అందుకు తల్లి దండ్రులు సహకరించాలని కోరారు. కార్య క్రమంలో వైద్యాధికారి పుష్పేంద్ర కుమార్‌, సర్పంచ్‌ వీర్ల వెంకటస్వామి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట: స్థానిక డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మునిసి పల్‌ ప్రాథమిక పాఠశాలలో పోలియో చుక్కలు కేంద్రం నిర్వహించారు. 7వ వార్దు కౌన్సిలర్‌ చేమిటిగంటి పార్వతి దేవి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో చుక్కలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఐదేళ్ళ లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిం టచాలని ప్రజలకు తెలిపారు. రాలేని పిల్లలకి సోమ, మంగళవారాలు ఇంటింటికీీ తిరిగి పోలియో చుక్కలు ఇంటి వద్దే వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఉపా ధ్యాయులు పోటు శ్రీనివాస రావు.7వార్డు ఎఎన్‌ఎం జి.నాగలక్ష్మి, అంగన్వాడీ కార్య కర్త కిరణ్మయి పాల్గొ న్నారు. చిలకలూరి పేటలోని స్థానిక తహ శీల్దార్‌ కార్యా లయం ఎదు రుగా పోలియో చుక్కలు కేంద్రం నిర్వహించారు. పట్ట ణంలో 15 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేశారు. సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లి మండలం ఫణిదం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 6601మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్‌ ప్రదీప్‌ తెలిపారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా సత్తెన పల్లి మండలం ఫణిదం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 35 పోలియో కేంద్రాలు, ఒక మొబైల్‌ కేంద్రం ద్వారా పోలియో చుక్కలు వేశారు. డాక్టర్‌ కవిత, డాక్టర్‌ గౌతమి, డాక్టర్‌ సాయి తేజ రెడ్డి పర్యవేక్షించారు.

➡️