పోలీసు స్టేషన్‌కు చేరిన ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు

ప్రజాశక్తి-నిమ్మనపల్లె మార్చి 1 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్ష ప్రశ్నాపత్రాలు మంగళవారం నిమ్మనపల్లె పోలీస్‌ స్టేషన్‌ చేరాయి. జిల్లా కేంద్రంలోని డిఐఒ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన మూడు సెట్ల ప్రశ్నా పత్రాలను నిమ్మనపల్లె ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌, పరీక్షల ముఖ్య నిర్వహణ అధికారి రాధాకష్ణయ్య, డిపార్ట్‌మెంటల్‌ అధికారి రెడ్డప్పరెడ్డితో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతాయని, పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీ క్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగు తాయని అన్నారు. నిమ్మనపల్లె ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి 171 మంది ప్రథమ సంవత్సరం,179 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. మండలంలోని రెడ్డివారి పల్లె మోడల్‌స్కూల్‌, కెజిబివి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.

➡️