పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలి

Mar 16,2024 22:16

ప్రజాశక్తి – సాలూరు : గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని ఐసిడిఎస్‌ ఆర్‌జెడి చిన్మయి దేవి చెప్పారు. శనివారం పోషణ్‌ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బంగారమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు, పిల్లలు విధిగా అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసిన పోషకాహారం వినియోగించుకోవాలని కోరారు. ఐరన్‌, కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు. ఎప్పటికప్పుడు బరువులు, ఎత్తులు చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుపి హెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక, సిడిపిఒ బి.సత్యవతి, సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు.

➡️