ప్రజలకు అందుబాటులో ఉంటా : ‘మండిపల్లి’

ప్రజాశక్తి- రాయచోటి రాబోయే రోజులలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని రాయచోటి టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని జామియా ఫ్రూట్‌ మార్కెట్‌లో ఉన్న మండి వ్యాపారులను మర్యాద పూర్వకంగా అందరినీ ఆత్మీయంగా కలిసి ఎన్నికల్లో తనకు మద్ధతు ఇవ్వాలని అభ్యర్థించారు. పట్టణంలోని పండ్ల వ్యాపార సంబంధ సమస్యలపై ఆరా తీశారు. తనను గెలిపిస్తే ప్రతి వ్యాపార యజమాని తమ వ్యాపార కార్యకలాపాలను ఎటువంటి సమస్యలు, ఒత్తిడి లేని వ్యాపార లావాదేవీల కేంద్రంగా రాయచోటిని అభివద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. సమయా నుగుణంగా వాడుకొని, నమ్మించి మోసం చేసే కుటుంబం మండిపల్లిది కాదని, ఇక్కడి వ్యాపారులు మండిపల్లి కుటుంబీకులతో అన్నదమ్ములవలె ఉండేవారమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిములకు ప్రభుత్వ ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తానని, మెటర్నిటీ ఆసుపత్రి కోసం అవసరమైతే తనవంతు సహాయంగా కోటి రూపాయలు స్వంత నిధులు ఖర్చు చేశానని హామీ ఇచ్చారు. అధికారం ఉన్నా, లేకున్నా అనునిత్యం ప్రజా సేవకే తమ జీవితం అంకితమని స్పష్టం చేశారు. వ్యాపారస్తులు, యజమానులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ మద్ధతు కచ్చితంగా మండిపల్లి రామ్‌ ప్రసాద్‌ రెడ్డికి ఉంటుందని, మరోసారి అబద్ధాలను నమ్మి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని తెలిపారు. అనంతరం మండీ వ్యాపారస్తులందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని మండిపల్లి కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న రోజుల్లో టిడిపిలోకి మరిన్ని చెరికలు ఉంటాయని మండిపల్లి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష, జాఫర్‌ వలి, మనోహర్‌ రెడ్డి, మండి ఇస్మాయిల్‌, జుల్‌ ఫక్రుద్దీన్‌, ఎస్‌కెబి. అంజద్‌, మండీ ఖదీర్‌, మండీ అంజద్‌, మండి బిలాల్‌, మండి అఖిల్‌, మండి చిన్న మగ్బూల్‌, మండి రూహుల్లా, మండి సికిందర్‌, మండి సాబిర్‌,మండి సమీవుల్లా, మండి షకీల్‌, మండి సౌడ్‌ ఇలియాస్‌, నాయుడు పలువురు పాల్గొన్నారు.

➡️