ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేమం: ఎమ్మెల్యే

ప్రజాశక్తి-ములకలచెరువు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దపాలెంలో నిర్మించిన హెల్త్‌ సెంటర్‌, రైతుభరోసా కేంద్రం, మొలకలచెరువు నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సచివాలయం-1 లను ఎమ్మెల్యే ప్రారంభించారు. సెంట్రల్‌ స్కూల్‌లో వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సకాలంలో సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. తద్వారా ప్రజలు సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మండలములోని రైతులకు ఆయ రైతు భరోసా కేంద్రాలలో కావలసిన ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉండటంతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లకుండా గ్రామాల్లోని వైద్య సేవలు అందించడానికి హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైసిసి కన్వీనర్‌ మాధవరెడ్డి, జడ్‌పిటిసి మోహన్‌రెడ్డి, ఎంపిపి సాయిలీల, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రజిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవీంద్రారెడ్డి, విశ్వనాథ్‌, ఆముదాల మధుసూదన్‌ రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, సర్పంచులు రహమత్‌ బి, చిన్న మేకల వెంకటరమణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, జయచంద్ర, ఎంపిటిసిలు అయిషా చాంద్‌బాషా, రఫీ, శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️