Attack: ఎస్‌ఐపై అధికార పార్టీ కార్యకర్తల దాడి

Jun 24,2024 22:29 #attack, #TDP Attacks

ప్రజాశక్తి-గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా) : ఎస్‌ఐపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల కేంద్రం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది. గుర్రంకొండ మండలం అల్లేపల్లికి చెందిన బి.రమణ స్థలంలోని ముళ్ల కంచెను కొంత మంది అధికార పార్టీ కార్యకర్తలు తొలగించారు. ఈ కంచెను రమణకు సంబంధించిన వ్యక్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో వారిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకునేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడే రెండు గ్రూపుల వారు మరోసారి గొడవపడ్డారు. స్టేషన్‌లో గొడవ పడొద్దని చెప్పడంతో ఎస్‌ఐ శ్రీనివాస నాయక్‌పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరు గ్రూపులను పోలీసులు చెదరగొట్టారు. టిడిపి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️