ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి

వికలాంగులకుబహుమతులు అందజేస్తున్నదృశ్యం

ప్రజాశక్తి-ఆత్రేయపురం

వికలాంగ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని జెడ్‌పిటిసి సభ్యుడు బోనం సాయిబాబా, రాష్ట్ర ఔట్సోర్సింగ్‌ డైరెక్టర్‌ కప్పల శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం వికలాంగ దినోత్సవాన్ని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. మండలంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సాహించాలన్నారు. మండల అభివద్ది అధికారి నాతి బుజ్జి మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులను ప్రోత్సాహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇటువంటి వికలాంగవిద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.కార్యక్రమంలో మండల నాయకులు కనుమూరి శ్రీనివాస రాజు, మండల విద్యాశాఖాధికారులు వర ప్రసాద్‌, పాచ్చా సాహెబ్‌, ఐఇఆర్‌ టీచర్లు అరుణ, జానకి, ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు, విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️