ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరులో జరుగుతున్న మాస్‌ కాపీయింగ్‌పై మంగళవారం ఆర్‌డిఒ కార్యాలయంలోని ఎఒ సత్యానంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు బయట వ్యక్తులను ప్రోత్సహించి 100 శాతం ఉత్తీర్ణత తెప్పించి విద్యను వ్యాపారం చేయడం కోసం ఇతర విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పడం అవాస్తమన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని అధికారికంగా విచారించి తక్షణమే మార్పు చేయాలని, ఈ చర్యలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్‌, ఆకేపాటి శివతేజ, కొప్పల కార్తిక్‌ పాల్గొన్నారు.

➡️