ప్రతి కుటుంబాన్నీ కలవాలి : శంబంగి

Mar 1,2024 20:58

 ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రతి కుటుంబాన్నీ బూత్‌ కమిటీ సంప్రదించి వైసిపి ప్రభుత్వంలో వారికి అందిన లబ్ధిని వివరించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సూచించారు. శుక్రవారం బొబ్బిలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ పరిధిలోని బూత్‌ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదనే లక్ష్యంతో బూత్‌ కమిటీలను పక్కాగా నియమించామని చెప్పారు. ప్రతి కుటుంబంతో పార్టీ కేడర్‌ మమేకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బూత్‌ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు కలిసి ‘మేము సిద్ధం- మా బూత్‌ సిద్ధం’ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణారావు, వైస్‌ చైర్మన్లు చెలికాని మురళీకృష్ణ, గొలగాన రమాదేవి, వైసిపి పట్టణ అధ్యక్షులు చోడిగంజి రమేష్‌ నాయుడు, సీనియర్‌ నాయకులు తూముల భాస్కరరావు, జిల్లా జెసిఎస్‌ కన్వీనర్‌ శంబంగి శ్రీకాంత్‌, పట్టణ కన్వీనర్‌ రేజేటి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.పేదల వైద్యానికి సిఎం సహాయ నిధి దోహదం పేదల వైద్యానికి సిఎం సహాయ నిధి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులకు వైద్యం చేసేందుకు సిఎం సహాయనిధి దోహదం చేస్తుందని చెప్పారు.

➡️