ప్రత్యామ్నాయమే

ప్రజాశక్తి- కడప ప్రతినిధిజిల్లాలో ప్రత్యా మ్నాయ పంట దిగబడులకు గిట్టు బాటు ధర లభిస్తోంది. నువ్వులు, మినుములు, జొన్న ఉత్ప త్తులకు ఆశావహమైన ధర పలుకు తోంది. ఈఏడాది తీవ్ర వర్షాభావ పరి స్థితుల నేపథ్యంలో జిల్లాకు వరదాయనులైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లో నీటికొరత శాపంగా మారింది. ఫలితంగా జిల్లాలోని కెసి కెనాల్‌, బ్రహ్మం సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇటు వంటి పరిస్థితుల నేపథ్యంలో 2023-24 రబీలో సాగు 67 శాతానికి పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్‌ పొడవునా ఆసాంతం నార్త్‌ ఈస్ట్‌ పంటలైన నువ్వులు తదితర పంటలు సాగవుతున్న నేపథ్యంలో స్పష్టత కొరవడింది. ఈనేపథ్యంలో నెలాఖరు నాటికి సుమారు 80 శాతానికి పంటల సాగు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంటున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎ. నాగేశ్వరరావుతో ప్రజాశక్తి ముఖా ముఖి…రబీ సాగు గురించి తెలపండి? 2023-24 రబీ సీజన్‌లో 3,07,000 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగు కావాల్సి ఉంది. ఈఏడాది రబీ సీజన్‌ మొదలు నుంచి నేటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 2.005 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఈలెక్కన 67 శాతం విస్తీర్ణంలో విత్తనం పడింది. మిగిలిన లక్ష ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యామ్నాయం అమలు తీరు తెలపండి? ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు ఆశించిన రీతిలో సాగడం లేదు. రబీ సీజన్‌లో పడిన రెండు లక్షల ఎకరాల్లో మూడింట ఒక వంతు విస్తీర్ణంలో ప్రత్యామ్నాయం ప్రణాళిక అమలు చేయడమైంది. ఇందులో మినుములు, పెసలు, జొన్న, అలసంద, ఉలవలు, కందులను గణనీయంగా సాగు చేయడం జరిగింది.బుడ్డశనగ దిగబడులపై స్పందించండి? జిల్లాలో బుడ్డశనగ సాగు విస్తీర్ణం 2,30 లక్షల ఎకరాలు. ఇందులో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 50 శాతానికి పరిమితమైంది. బుడ్డశనగ స్థానంలో గణనీయమైన విస్తీర్ణంలో మినుము పంట సాగు కావడ మైంది. బుడ్డశనగ పంట కోతలు ఊపందు కున్నాయి. దిగుబడులు ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లకు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి పంటల కోత అనంతరం దిగబడులపై స్పష్టత లభించే అవకాశం ఉంది.గ్యాప్‌ సర్టిఫికెట్‌ ఏమిటి? ఆర్గానిక్‌ వ్యవసాయానికి సంబంధించిన సర్టిఫికెట్‌. కడప, గుంటూరు జిల్లాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం పెద్దఎత్తున సాగుతోంది. ఇందులోభాగంగా ఈనెల 12న కడప జిల్లాకు చెందిన ఒఎఫ్‌పిఒ ఢిల్లీలో ఎన్‌డిసి అధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకోనుంది. డ్రోన్‌ టెక్నాలజీ లభ్యత ఎలా ఉంది? జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున డ్రోన్‌ అందించాల్సి ఉంది. మొదటి విడతలో భాగంగా 30 మందిని గుర్తించాం. ఇందులో 25 డ్రోన్స్‌ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్‌ఫుడ్‌ సబ్సిడీ నిధుల పెండింగ్‌ ఎంత? గతేడాది డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాల ధాటికి నష్ట పోయిన 7,521 రైతులకు సుమారు రూ.7కోట్ల పరిహారం ప్రతి పాదనలు అందజేశాం.ఇకెవైసి నమోదు ఎలా ఉంది? ఇకెవైసి నమోదు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికి 87 శాతం నమోదైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మూడవ స్థానంలో ఉన్నాం.ఎ.నాగేశ్వరరావు వెల్లడి

➡️