ప్రపేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

జాశక్తి-చీమకుర్తి : పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండలపరిధిలోని దేవరపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయ కాంప్లెక్స్‌ భవనాన్ని సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా, కూటములుగా ఏర్పడినా వచ్చే ఎన్నికల్లో వైసిపీదే విజయమని తెలిపారు. వైసిపికి ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, నిప్పట్లపాడు ఎంపిటిసి చిన్నపురెడ్డి వెంకటరెడ్డి,మాజీ సర్పంచులు పులి వెంకటరెడ్డి, గంగిరెడ్డి ఓబులరెడ్డి, వైసిపి మండల నాయకులు చిన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైసిపి మండల మాజీ అధ్యక్షుడు దాసరి లక్ష్మినారాయణ, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️