ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-మార్కాపురం : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పిఆర్‌సి, డిఎ, పిఎఫ్‌, ఏపీ జిఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బకాయిపడిన రూ.18వేల కోట్లు తక్షణమే విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఒద్దుల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి పి. ప్రభాకర్‌, ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాపయ్య, శ్రీనివాస్‌ నాయక్‌, సుబ్బారావు, శ్రీనివాసులు, అల్లూరి శ్రీను, రామారావు, టిపి.వెంకటేశ్వర్లు, అల్లూరిరెడ్డి, నాసరయ్య, కపురం వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️