ప్రభుత్వ రంగాన్ని కాపాడండి

Jan 19,2024 19:53

 ప్రజాశక్తి-శృంగవరపుకోట :  ప్రభుత్వ రంగాన్ని కాపాడే ఎల్‌ఐసిని బలోపేతం చేయాలని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు టి. జగన్నాథం, కార్యదర్శి జి.నానిగురు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు, జీవిత బీమా జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 1956 జనవరి 19న అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి, సి.డి దేశ్‌ముఖ్‌ జీవిత బీమా రంగంలో ఉన్న 245 ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అన్నింటిని జాతీయం చేశారని తెలిపారు. నేటి బిజెపి పాలకులు ఎల్‌ఐసిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే వాటాలను విక్రయిస్తున్నారని అన్నారు. లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ చాలా వేగంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదనిఅన్నారు. ఈనేపథ్యంలో ‘ప్రభుత్వ రంగాన్ని కాపాడండి – ఎల్‌ఐసిని బలోపేతం చేయండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాల వద్ద బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ప్రదర్సనలు నిర్వహించామని తెలిపారు.

➡️