ప్రమాదకరమైన చట్టం రద్దుకు సంతకాల సేకరణ

Feb 14,2024 21:41

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ :  డ్రైవర్లను జైల్లో పెట్టే క్రిమినల్‌ చట్టం బిఎస్‌ఎన్‌ 106(1,2) రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ఫీజులు, పెనాల్టీల భారాలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షాకు ఈనెల 16న కలెక్టర్‌ ద్వారా వినతి పత్రం ఇచ్చేందుకు సంతకాల సేకరిస్తున్నట్లు ఎఐఅర్‌టిడబ్ల్యుఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌రావు, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు తెలిపారు. బుధవారం ఐనాక్స్‌ ఆటో స్టాండ్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌.శ్రీను ఆధ్వర్యంలో సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనతరం మాట్లాడుతూ అన్ని రకాల ప్రభుత్వ/ ప్రైవేటు వాహన యజమానులు, చోదకులు సంతకం చేసి , 16న ఉదయం 9 గంటలకు కోట నుంచి ప్రారంభమయ్యే వాహన ర్యాలీలో యూనిఫామ్‌తో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆటో యూనియన్‌ నాయకులు శ్రీను, రామునాయుడు, రాజు, లక్ష్మణ దొర, మోహన్‌, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️