ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు

Feb 24,2024 21:06

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూల్‌ రేంజ్‌ డిఐజి సిహెచ్‌ విజయరావు అన్నారు. శనివారం ఆయన జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాన్ని ఎస్‌పి బి.కృష్ణా రావుతో కలిసి తనిఖీ చేశారు. మొదటగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. మద్యం డబ్బు బార్డర్‌ చెక్‌పోస్టుల వద్ద అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రాపర్టీ నేరాల రికవరీ, రోడ్డు ప్రమాదాలు రాత్రి పూట గస్తీ, నాన్‌ బైలబుల్‌ వారెంట్‌, మర్డర్‌ కేసులు, ముద్దాయిల అరెస్టులు తదితర పెండింగ్‌ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయుధాల లైసెన్సుల డిపాజిట్లు, రౌడీ షీటర్లు, సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్ని కలు సమీపిస్తున్నందున పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికలలో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ టీం వర్గ పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా చూడాలని సూచించారు. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండా లన్నారు. ఎస్‌పి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిం చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లాలో నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా తగ్గించామన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావర ణంలో జరిగే విధంగా ముందస్తు ప్రాణాలికతో ముందుకు సాగుతామన్నారు. జిల్లాలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో వెంటనే అప్రమత్తం చేస్తున్నామని డిఐజి దష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన డిపిఒలోని అన్ని విభాగాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పిసిఆర్‌బి విభాగంలో మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీ నేరాలు ఇతర ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు. అందరూ టీం వర్క్‌ ఏర్పడి భద్రతాపరంగా గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు పి.డాక్టర్‌ వి.బి.రాజ్‌ కమల్‌, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️