ప్రశ్నే ప్రగతికి సోపానం: జనవిజ్ఞానవేదిక

ప్రజాశక్తి-గిద్దలూరు: ప్రశ్నించడం ద్వారానే సమాజం మార్పు చెందుతుందని జన విజ్ఞాన వేదిక సీనియర్‌ నాయ కులు డాక్టర్‌ భూమా బాల నరసింహారెడ్డి అన్నారు. ప్రజాస్వామిక వాతావరణం లేకుండా ప్రశ్న ఉండ దని, సమానత విలువలు లేకుండా ప్రశ్న రాణించ దని పేర్కొన్నారు. పట్టణంలోని సూర్య విద్యానికే తన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కళాజాతా సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రజా స్వామ్యం, సమానత్వం, లౌకికవాదం బలంగా ఉండాలని జన విజ్ఞాన వేదిక ఆకాంక్షిస్తోందన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి స్వరూపా రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో 51 ఏ (హెచ్‌)లోని ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పరిరక్షించుకునే క్రమంలో భాగంగా జన విజ్ఞాన వేదిక ఈ కళాజాతా చేపట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నా మని తెలిపారు. ఈ ప్రదర్శనలో కార్పొరేట్‌ చదువులు, పర్యావర ణ పరిరక్షణ, యువత -దేశ భక్తికి సంబంధించిన నృత్య రూపకాలు, మూఢనమ్మకాలను తొలగించే నాటకాలు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే పాటలు, మ్యాజిక్‌-మ్యూజిక్‌లతో కళాజాతా జరుగుతుందని అన్నారు. రాచర్ల మండల విద్యాశాఖ అధికారి శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ తాయని తెలిపారు. కళాజాతా సభ్యులు, విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు మండ్ల శ్రీనివాసులు, డాక్టర్‌ జేవీ నారాయణ, కె త్రిమూర్తులురెడ్డి, పి రమణారెడ్డి, జి రవీంద్రనాథ్‌ రెడ్డి, డి గురు స్వామి, డి వెంకటేశ్వర్లు, డిజి బ్రహ్మానందరెడ్డి, కొండేటి రాజా, ఏ అల్లూరయ్య, ఏ విశ్వరూపం, పి సుధీర్‌ కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌, చైతన్య, వివిధ పాఠశాలల యజమానులు, పాఠశాలల సిబ్బంది, జన విజ్ఞాన వేదిక సభ్యులు హాజరయ్యారు.

➡️