ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన

ఆగిరిపల్లి : భావితరాల భవిష్యత్తుకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించాలని, ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మానవ మనుగడకు ముప్పు వాటిల్లనుందని అడవినెక్కలం గ్రామ సర్పంచి వేము రాజు అన్నారు. ఆనంద మహిళా మండలి ఆధ్వర్యంలో అడవినెక్కలం గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనంద మహిళా మండలి అధ్యక్షురాలు టి.సంధానాని, పవర్‌ మినీస్ట్రీస్‌ ఛైర్మన్‌ టి.విజయబాబు, బి.డేవిడ్‌రాజు పాల్గొన్నారు.

➡️