ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుటుంబాన్ని ఆదుకోండి

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని సూడిగాంలో 15 ఏళ్లు నుంచి ఉపాధిహామీ చట్టం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన పాలూరు నారాయణరావు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు నారాయణరావు భార్య శాంతి, కుటుంబ సభ్యులు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ తన భర్త నారాయణరావు 15 ఏళ్ల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేసి అనారోగ్యంతో మరణించారని, తన మరణానంతరం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు విన్నవించుకోగా, మా గ్రామ పంచాయతీ పెద్దలు ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారన్నారు. ఆ తీర్మాన కాపీని ఎంపిడిఒకి అందజేయగా, తనను ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా నియమిస్తామని నమ్మబలికి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వేరే వారిని నియమిస్తున్నారని వాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా తనని నియమించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈమె పోరాటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, నాయకులు జి.వెంకటరమణ, శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిరా, ఫీల్డ్‌ అస ిస్టెంట్ల యూనియన్‌ నాయ కుల హరినాథ్‌, రౌతు కైలాసం, సర్పంచ్‌ పైల సూర్య నారాయణ, మాజీ సర్పంచ్‌ చంద్రమౌళి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

➡️