బకాయిలపై యుటిఎఫ్‌ పోరుబాట

తెనాలి ట్రెజరీ వద్ద బైఠాయించిన ఉద్యోగులు
ప్రజాశక్తి- గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై యూటిఎఫ్‌ పోరుబాటలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బుధవారం ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా తెనాలిలోని సబ్‌ ట్రెజరీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, పొన్నూరులో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రా లిచ్చారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి, ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ర.వందల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని, 1వ తేదీన రావాల్సిన జీతం 17వ తేదీ వరకు కూడా రావడంలేదని అన్నారు. ఇప్పటికైనా బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యలపై 9వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమాల్లో నాయకులు గయాను ద్దౌలా, కె.సాంబశివరావు, ఎస్‌.బసవేశ్వరరావు, కె.కామాక్షి, ఏసుబాబు, అహ్మద్‌ హుస్సేన్‌, ఎంఎస్‌ చక్రవర్తి, కెఎస్‌ ప్రసాద్‌, డి.సౌజన్య, డి.ప్రదీప్‌చంద్‌, కె.కుసుమకుమారి, యు.రాజ శేఖర్‌, టి.ఆంజనేయులు, ఎ.శ్రీనివాసరావు, సిహెచ్‌ సత్య, శివ నాగేశ్వరరావు, సుబ్బారావు, చిన్నం శ్రీనివాసరావు, ఠాగూర్‌, విష్ణుమూర్తి, వెంకట్రావు, కిషోర్‌, ధామస్‌, రాజేష్‌, రాంమ్‌ ప్రసాద్‌, భాస్కర్‌, శేషగిరి, శ్రీనివాసరావు, కె.తిరుపతి స్వామి, కె.శ్రీనివాసరెడ్డి, స్నేహలత, యాసీన్‌, చెన్నకేశవులు, సుధాకర్‌, హరిప్రసాద్‌, నాగమల్లేశ్వరరావు, పార్థసారది,¸ పాపయ్య, ఉమామహేశ్వరరావు, వెంకటస్వామి, కరీ ముల్లా, నాగేశ్వరావు, చంద్రశేఖర్‌, షేక్‌ జమాల్‌, కె.భావన్నారాయణ, ఏ.వి.శ్రీనివాసరావు, డి.సాయికృష్ణ, జితేంద్ర, ఎస్‌.శివప్రసాదరావు, జి.భాస్కరరావు, జి.యేసోబు, మౌలాలి, పూర్ణచంద్రరావు, హజారుద్దీన్‌, రాజుశేఖర్‌, సుధాకర్‌, కృష్ణ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️