బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

ప్రజాశక్తి – భీమడోలు

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యాభివృద్ధికి కృషి చేసన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని గుండుగొలను గ్రామపంచాయతీ ఉపసర్పంచి, వైసిపి గ్రామ అధ్యక్షులు ముదుండి సూర్యనారాయణ రాజు తెలిపారు. గుండుగొలను సంతపేట సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో మంగళవారం పూలే వర్థంతి కార్యక్రమాన్ని ఉపసర్పంచి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమడోలు సర్పంచి పి.సునీత మాన్సింగ్‌, ఎఎంసి ఛైర్‌పర్సన్‌ ఇంజేటి నీలిమ, భీమడోలు సొసైటీ అధ్యక్షులు ఆర్‌.సత్య శ్రీనివాస్‌, చైతన్య యువజన సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మాన్సింగ్‌, టిడిపి నాయకులు ఎస్‌.కొండబాబు, బిసి.నాయకులు పి.సత్యనారాయణ, వైసిపి గ్రామ సచివాలయాల కన్వీనర్‌ జి.మురళీ, సామాజిక కార్యకర్త టి.సుమన్‌ బాబు, వగ్వాల అచ్యుతరామయ్య పూలే జీవిత విశేషాలు వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ప్రముఖులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, కులమత బేధాలకు తావు లేకుండా గ్రామస్తులందరూ కలిసి పూలే కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయమన్నారు. ఆయన ఆశయం మేరకు బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అందరూ తమ వంతు సహకరించాలని కోరారు.

చింతలపూడి: మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, దేశంలోనే అంటరానితనంను ఎదిరించిన మొట్టమొదటి సంఘసంస్కర్తగా, వితంతు వివాహాలు వంటి అనేక స్త్రీ జనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టారని సాధికార సమితి జిల్లా కన్వీనర్‌ కొప్పెర్ల నాగరాజు కొనియాడారు. పూలే 134వ వర్థంతి సందర్భంగా ప్రగఢవరం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కొనకల్ల వీర్రాజు, బిసి కార్యదర్శి చక్రపు మారేశ్వరరావు, మాజీ వార్డు మెంబర్‌ రాచకొండ రాంబాబు, బిసి నాయకులు చిమట బాబు, మండల బిసి కార్యదర్శి తాళం చెన్నారావు పాల్గొన్నారు.

➡️