బర్రెలక్కను గెలిపించాలి

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్‌ శిరీషను ముస్లిం సమాజం ఓట్లు వేసి గెలిపించాలని ప్రముఖ ప్రజాస్వామ్య, సెక్యులర్‌ మానవతావాది బ్రదర్‌ సిరాజుల్‌ రెహమాన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్‌ కాపు కళ్యాణ మండపంలో జరిగిన ముస్లిం ఐక్య వేదిక ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పోకడల గురించి వివరించారు. కొల్లాపూర్‌లోని ముస్లింలు ఏకతాటిపై నిలబడి ఆమెకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బాపట్ల: జనాభా దామాషా పద్ధతి ద్వారా చట్టసభల్లో ముస్లింలకు సముచిత స్థానం కల్పించాలని ప్రముఖ ముస్లిం హక్కుల ఉద్యమ నాయకులు తెలంగాణకు చెందిన సిరాజుల్‌ రెహమాన్‌ అన్నారు. రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆది వారం బాపట్ల అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ముస్లిం ఐక్యవేదిక సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ముస్లిం ప్రముఖులు హాజర య్యారు. బాపట్ల నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు మౌలా బేగ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిరాజుల్‌ రెహమాన్‌ మాట్లాడుతూ ప్రధానంగా ముస్లింలను ఏకం చేయడమే రాష్ట్రస్థాయిలో ముస్లిం ఐక్యవేదికల లక్ష్యమన్నారు. సదస్సులో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కలాం, అధికార ప్రతినిధి సయ్యద్‌ ఖలీల్‌ అన్వర్‌, నూర్‌, ఐక్యవేదిక బాపట్ల కమిటీ నాయకులు మహమ్మద్‌ గౌస్‌, షేక్‌ జిలాని, షేక్‌ తాజు, బాపట్ల అంజుమన్‌ కమిటీ అధ్యక్షులు షేక్‌ జిలాని, ప్రముఖ న్యాయవాది జమృద్‌ బాషా, నూర్‌ భాషా సంఘం నాయకులు ఎన్‌ సిద్దయ్య, రియాజ్‌, పలువురు ముస్లిం ప్రముఖులు, ముస్లిం మహిళా నాయకులు పాల్గొన్నారు.

➡️