భూ కబ్జాదారులపై చర్యలు

అధికారులు మీమీ ఉద్యోగ బాధ్యతలను పక్షపాత వైఖరి

వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

మందస:

అధికారులు మీమీ ఉద్యోగ బాధ్యతలను పక్షపాత వైఖరి లేకుండా, ఎవరికీ భయపడకుండా సక్రమంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తిరుమలబాబు అధ్యక్షతన సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలన వలే కాకుండా అర్హులందరికీ సంక్షేమం పథకాలు అందించడమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తామన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో అర్హత లేకుండా సంక్షేమ పథకాలు పొందుతున్న వారి వివరాలు చెప్పి మరీ తీసివేస్తామన్నారు. కొండలు, గుట్టలు మింగేస్తున్న గత ప్రభుత్వ హయాంలో అధికారులకు చర్యలు తీసుకునే స్వేచ్ఛ లభించలేదన్నారు. అధికారులు ఎవరికీ భయపడకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. మందస మండలంలో భూముల కబ్జాలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, భూ కబ్జాలదారులపై చర్యలు తప్పవని, సాక్షాలతో సహా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️