బహిరంగసభ కోసం భూమిపూజ

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా: చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17నలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభకు బుధవారం టిడిపి నేతలు భూమిపూజ చేశారు. వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడు పార్టీ మధ్య పొత్తులు కుదిరాక జరుగుతున్న మొదటి సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభను ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న బొప్పూడి వద్ద నిర్వహించ నున్నారు. సభా ఏర్పాట్లలో భాగంగా బుధ వారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్‌, బాచిన చెంచుగరటయ్య, ఎంఎం కొండయ్య పాల్గొన్నారు.

➡️