బాధిత కుటుంబాలకు భరోసా

'నిజం గెలవాలి'

‘నిజం గెలవాలి’లో పరామర్శించిన భువనేశ్వరి

ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

ప్రజాశక్తి- కలెక్టరేట్‌/ గాజువాక, సీతమ్మధార: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో తీవ్ర మనోవేదనకు గురై కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన బాధిత కుటుంబాలకు అధైర్యపడొద్దు, అండగా తామున్నామంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ‘నిజం గెలవాలి’ ఉత్తరాంధ్ర పర్యటన మూడవ రోజు శుక్రవారం విశాఖపట్నంలోని ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలతోపాటు గాజువాకలో పర్యటించారు.. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మిక మరణానికి గురైన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. నోవాటెల్‌ విడిది కేంద్రం నుండి ప్రారంభమైన భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర, ముందుగా దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో టిడిపి కార్యకర్త జాగరపు చిన్న(47) కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న భార్య గౌరి, కుమార్తెలు దేవి, నందిని, కుమారుడు కిరణ్‌ లను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. అనంతరం 41వ వార్డులోని మలిశెట్టి రమణ(55) కుటుంబాన్ని పరామర్శించారు. రమణ కుమారుడు రాజు, కోడలు సంతోషి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 45 వ వార్డులో పంచిరెడ్డి కనకారావు(52) కుటుంబాన్ని పరామర్శించారు. కనకారావు భార్య పార్వతి, కుమార్తె ఉదయశ్రీ, కుమారుడు శ్యామ్‌లను పరామర్శించారు. గాజువాక 65వ వార్డులోని కోరుకొండ వెంకటరమణ(61) కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటరమణ భార్య మంగ, కుమారుడు శ్రీను, కుమార్తె లక్ష్మిల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే వార్డులోని ఉప్పలపాటి సరోజిని కుటుంబాన్ని పరామర్శించారు.సరోజిని భర్త వెంకట అప్పల నరసింహరాజు, కుమారుడు శ్రీనివాసరాజు, కోడలు సునీత, కుమార్తె లక్ష్మిలను పరామర్శించారు. 69వ వార్డులోని పమిడిముక్కల రాధాకష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. రాధాకష్ణమూర్తి కుమారులు వెంకట్రావు, ప్రభాకర్‌, కోడళ్లు స్వరాజ్యలక్ష్మి, శశికళ లతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిసాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. బాధిత కుటుంబాల పరామర్శ అనంతరం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకుని హైదరాబాద్‌ వెళ్లారు.భువనేశ్వరికి ఘన స్వాగతం ‘నిజం గెలవాలి’లో భాగంగా. గాజువాక విచ్చేసి భువనేశ్వరికి టిడిపి జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసాదుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గంధం శ్రీనివాసరావు. 67వ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు. పులి వెంకటరమణారెడ్డి, టిఎన్‌టియుసి నేతలు రామ్మోహన్‌ కుమార్‌, నక్క లక్ష్మణరావు, నమ్మి సింహాద్రి. గోమాడ వాసు, సింగూర్‌ ఆనంత్‌, రట్టి వాసు బైబిల్‌ గాంధీ, మహ్మద్‌ రఫీ, చెరుకూరు నాగేశ్వరరావు, తెలుగు మహిళలు సరోజిని, రాంబాయి, జ్యోతి,భవాని, ఉష. గొలగాని వెంకన్న.,గాజువాక నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అలాగే 45వ డివిజన్‌ తాడిచెట్లపాలెం పర్యటనలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు వంగలపూడి అనిత, గండిబాబ్జి, సంధ్యారాణి, లలితకుమారి, కోరాడ రాజబాబు, విజయబాబు, బండారు అప్పలనాయుడు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌, అనంతలక్ష్మి,ఈతలపాక సుజాత పాల్గొన్నారు.భువనేశ్వరిని కలిసిన జనసేన నేతలునిజం గెలవాలి పర్యటనకు విశాఖ వచ్చిన భువనేశ్వరిని నోవాటెల్‌ హోటల్‌లో చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పివిఎస్‌ఎన్‌.రాజు,కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడం, అండగా ఉండడం నిబద్ధతకు నిదర్శనమన్నారు.

➡️