బాధ్యతలు చేపట్టిన సబ్‌కల్టెర్‌ ప్రకార్‌ జైన్‌

ప్రజాశక్తి – తెనాలి : తెనాలి సబ్‌ కలెక్టర్‌గా ప్రకార్‌ జైన్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్ర దేశ్‌కు చెందిన ఈయన 2020-21 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి. కాకినాడ, ఢిల్లీలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తొలి పోస్టింగ్‌ తెనాలి సబ్‌ కలెక్టర్‌గా పొందారు. తెనాలి వచ్చిన ఆయన తొలుత వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న తెనాలి సబ్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ పొందడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించాల్సిన ప్రధాన బాధ్యత ప్రస్తుతం తనమీద ఉన్నట్లు చెప్పారు. అన్ని మండలాలు పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేస్తానని, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

➡️