బాలినేనికి సత్కారం

ప్రజాశక్తి-శింగరాయకొండ : మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసిపి నాయకులు బుధవారం సత్కరించారు. మూలగుంటపాడు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన బాలినేని వైసిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి నివాసం వద్ద వైసిపి నాయకులు స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య, వైసిపి యువజన విభాగం రాష్ట్ర నాయకుడు శీలం రాము, చుక్కా కిరణ్‌, కుమార్‌ చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, షేక్‌ కరీం, కుంచాల సాయి వేణు పాల్గొన్నారు.

➡️