బెదిరింపులకు భయపడం

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్క రించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగ న్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రకరకాల ఎత్తు గడలకు పాల్పడుతోంది. కేంద్రాలకు తాళాలు పగుల గొట్టించడం, సచి వాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగిం చడం వంటి చర్యలకు పూను కుంటోంది. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు సిఐ టియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియులతో పాటు సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్‌, జనసేన పార్టీలకు చెందిన నాయకులు సంపూర్ణ మద్దతు తెలియ జేశారు. వారి మద్దతుతో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృత రూపం దాల్చుతోంది. కార్యకర్తలు, ఆయాలు ఎక్కడికక్కడ కార్యాలయాల ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్వాడీలను బెదిరించేందుకు ప్రభుత్వం చూస్తోందని, ఆ బెదిరింపులకు బయపడే ప్రసక్తే లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. అంగ న్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ముందు అంగ న్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె కొనసాగితే తల్లిబిడ్డలకు ఎదురయ్యే సమ స్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం బాధ్య తారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విచ్చిన్న ఎత్తుగడలను ఎదుర్కొని కార్మి కులు, ఉద్యోగులు ఐక్యంగా నిలబ డాలని, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల తరగతుల ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అంగన్వాడీలకు సంఘీభా వంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. అనేక చోట్ల ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు అంగ న్వాడీల కేంద్రాల తాళాలు పగులగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుం టున్నారని దీనివల్ల సమ్మె నివారణకు బదులు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలో బాధ్యాతారహితంగా మాట్లాడి, అంగన్వాడీలపై నోరుపారేసుకున్న రైల్వేకోడూరు ఎమ్మేల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోడూరులో వైసిపి కార్యకర్తలు టెంట్లు పీకేస్తున్నా, ఈ చట్ట విరుద్ధ చర్యలను పోలీసులు దగ్గరుండి జరిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా సాగుతున్న సమ్మెను శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని, ఈ సమ్మెకు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్క రించేందుకు చొరవచూపి సమ్మెను విరమింప జేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామాం జులు, రామచంద్ర, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు భాగ్యలక్ష్మి, విజయమ్మ, బంగారుపాప, ఖాజాబీ, మషూన్‌ బీ, సిద్ధమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాయచోటి : అంగన్వాడీలను మోసం చేసిన ముఖ్య మంత్రి జగన్‌ గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదరవల్లి, మండల అధ్యక్షుడు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు సుబ్బయ్య నాయుడు, గన్మెన్‌ రాజు పాల్గొన్నారు. కంభంవారిపల్లె : కె.వి.పల్లి, కలకడ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మూడో రోజు సమ్మెలో భాగంగా ప్రాజెక్ట్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డమ్మ, శారద, కార్యకర్తలు, ఆయాలు పాల్గొ న్నారు. రాజంపేట అర్బన్‌ : నందలూరు, రాజంపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. వారికి రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త అతికారి దినేష్‌, జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు, మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, ఎఐటియుసి నాయకులు ఎమ్మెస్‌ రాయుడు, సికిందర్‌, నాయకులు ఆకుల చలపతి, నాసర్‌ఖాన్‌, పివిఆర్‌ కుమార్‌, చౌడయ్య, అబ్బిగారి గోపాల్‌, కాపు సంక్షేమ సేన అన్నమయ్య జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ బాబు, రాయలసీమ కోఆర్డినేటర్‌ కుప్పాల జ్యోతి పాల్గొ న్నారు. మదనపల్లి : అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్‌ గంగారపు రాందాస్‌ చౌదరి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లిగడ్డకు, ఉర్లగడ్డకు తేడా తెలియని సిఎంకు అంగన్వాడీల సమస్యలేమి తెలుస్తాయన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్‌ మాట్లాడుతూ అంగనవాడీ సిబ్బందికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు మధురవాణి, రాజేశ్వరి, గంగా, అంగన్వాడీ కార్యకర్తలు, జనసేన టౌన్‌ ప్రెసిడెంట్‌ నాయని జగదీష్‌, రూరల్‌ అధ్యక్షులు గ్రానైట్‌ బాబు, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి,చంద్రశేఖర, జంగాల గౌతమ్‌, నవాజ్‌,పవన్‌ శంకర, కుమార్‌, లవన్న, ఐటీ విభాగం లక్ష్మి నారాయణ, జనార్దన్‌, నరేష్‌, ఆదినారాయణ, సిఐటియు నాయకుడు ప్రభాకర్‌ రెడ్డి, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పాల్గొన్నారు. అంగన్వాడీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి రెడ్డి సాహెబ్‌, టిడిపి రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్‌, రాటకొండ మధుబాబు, సురేంద్రరెడ్డి, మహబూబ్‌ పీర్‌, శరత్‌ కుమార్‌రెడ్డి, రవి, బిఎస్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతం కుమార్‌, నాయకులు మద్దతు తెలిపారు. రైల్వేకోడూరు : అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు మంజుల, అధ్యక్షులు ఎన్‌.రమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాధా కుమారి, మండల కార్యదర్శి జి పద్మ, వెన్నెల, శిరీష, లీలావతి, ఈశ్వరమ్మ, మైతిలి, సునీత, నిర్మల, వాణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పి.జాన్‌ ప్రసాద్‌, ఎఐటియుసి జిల్లా కో-కన్వీనర్‌ సరోజ పాల్గొ న్నారు. పీలేరు: అంగన్వాడీలు తమ సమస్యల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్ర మంలో టిడిపి మండల కన్వీనర్‌ వారణాసి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ కన్వీనర్‌ అమర్నాథ్‌ రెడ్డి, బిసి విభాగం రాష్ట్ర నాయకులు పురం రామ్మూర్తి, మాజీ ఎంపిటిసి పోలిశెట్టి సురేంద్ర, సిఐటియు నాయకులు దనాసి వెంకట్రామయ్య, ఎఐటియుసి నాయకులు సాంబశివ, టిఎల్‌ వెంకటేష్‌, అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. బి.కొత్తకోట : ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలుమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ములకలచెరువు, బి.కొత్తకోట, పిటిఎం మండలాల కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. కలకడ: ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమ తమ కోరికలకు సంబంధించిన నివేదికలతో మూడు రోజులుగా ఆయా జిల్లా కేంద్రాలు ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నాలు, నిరవధిక సమ్మెలో నిర్వహిస్తున్నారు. సచివాలయ మహిళా పోలీసులు సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కార్యాలయాలను నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళం వేసి ఉంటే వాటిని పగులగొట్టి కేంద్రాలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఒ మునీంద్రనాయక్‌, ఎపిఎం రమేష్‌, కలకడ, కోన, పాపిరెడ్డిగారిపల్లి పాల్గొన్నారు. సుండుపల్లె : పచ్చిగడ్డి తింటూ అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మెకు టిడిపికి చెందిన మాజీ జిల్లా పరిషత్‌ వైస్‌ సుగువాసి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు ముకరం చంద్‌ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు భూక్య విశ్వనాథ నాయక్‌, అంగన్వాడీ నాయకులు నాగేశ్వరి, టిడిపి, జనసేన నాయకులు కల్లేరెడ్డప్ప, రెడ్డి రాణి, వెంకటేష్‌ నాయుడు, దామోదర్‌ నాయుడు, ఆనంద్‌ నాయక్‌, చంద్రమౌళి, రామచంద్ర, రమణ పాల్గొన్నారు

➡️