బెల్ట్‌ షాపులపై ప్రత్యేక నిఘా : ఎస్‌పి

Jan 19,2024 20:23

ప్రజాశక్తి-మెరకముడిదాం :  జిల్లాలో గతంలో కంటే ప్రమాదాల సంఖ్య తగ్గిందని ఎస్‌పి దీపిక తెలిపారు. బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శుక్రవారం మండలంలోని బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌ను ఎస్‌పి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను, అదే విధంగా ఖైదీలను ఉంచే గదులను, స్టేషన్‌ పరిధిలో ఉన్న వాహనాలను పరిశీలించారు. వాటి వివరాలను ఎస్‌ఐ బి.లోకేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే తొమ్మిది బెల్ట్‌షాప్‌లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసు యంత్రాంగానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్‌పి ఎ.ఎస్‌.చక్రవర్తి, చీపురుపల్లి సిఐ హెచ్‌ ఉపేంద్ర, ఎస్‌ఐ కెకెకె నాయుడు, గరివిడి ఎస్‌ఐ దామోదర్‌, గుర్ల ఎస్‌ఐ భాస్కరరావు పాల్గొన్నారు.

➡️