బైక్‌ను ఢకొీన్న బొలెరో వాహనం

బైక్‌ను ఢకొీట్టి రోడ్డు పక్కకు తోసికెళ్లిన బొలెరో వాహనం

ఇద్దరికి తీవ్ర గాయాలు-

మరో ఏడుగురికి స్వల్ప గాయాలు

ప్రజాశక్తి-మారేడుమిల్లి

మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుడిస రోడ్డుపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిస పర్యాటక ప్రాంతాన్ని తిలకించి తిరుగు ప్రయాణిస్తున్న మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన ఏపీ 05ఇకె 3064 గల బొలెరో వాహనం బ్రేకులు ఫెయిలై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన డి.నాగేంద్ర (23), కె.పూర్ణచందు (22) ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. బోలోరో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరిని హుటాహుటిన వాహనాల్లో పోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వీరిలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకునికి తీవ్రంగా గాయాలు కావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో గుడిస పర్యటక ప్రాంతానికి వెళ్లిన వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఆయా వాహనాలను నియంత్రించాల్సిన పోలీస్‌, రెవెన్యూ, అటవీశాఖలు దృష్టి సారించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పలువురు నుండి బాహటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖలు దృష్టి సారించి ప్రమాదాలను నివారించాలని పలువురు కోరుతున్నారు.

➡️