భయం పోగోట్టెందుకే ప్లాగ్‌ మార్చ్‌

Mar 9,2024 21:22

ప్రజాశక్తి – రామభద్రపురం: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో పోలింగ్‌ పై ఉన్న భయాలు పోగొట్టి నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కునేందుకు ప్లాగ్‌ మార్చ్‌ (పోలీసు కవాతు) నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి రూరల్‌ సిఐ తిరుమలరావు తెలిపారు. శనివారం కొండ కెంగువ పంచాయతీలో స్థానిక ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌, సిఆర్‌పిఎఫ్‌ సాయుధ పోలీసులుతో కలిసి గ్రామమంతా కలియతిరిగి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగ కుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం ఉందనే భరోసా కల్పించడానికి ఫ్లాగ్‌ మార్చ్‌ చేస్తున్నట్లు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలం దరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహ కరించ వద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు. గ్రామ సర్పంచ్‌ సుజాత, వైస్‌ ఎంపిపి ప్రసాద్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.చీపురపల్లి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకుగాను చీపురు పల్లి పట్టణంలో సిఐ షణ్ముఖరావు, ఎస్‌ఐలు కిరణ్‌ కుమార్‌ నాయుడు, లోకేష్‌ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు ప్లాక్‌ మార్చ్‌ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత యుతంగా నిర్వహిం చేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

➡️