‘భూ హక్కు’తో రైతులకు మేలు : ఎమ్మెల్యే

Jan 13,2024 20:45

 ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌  :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన భూ హక్కు కార్యక్రమంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. శనివారం జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమంలో భాగంగా రాముడువలస రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులకు భూ హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు వందేళ్ల తర్వాత సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు శాశ్వత మేలు చేకూరుతుందన్నారు. ఇదివరకు ఎప్పుడూ కూడా పట్టాదారు పాసుబుక్కులో లేని భూమి కొలతల పటం, ఎటువంటి నకిలీలకు ఆస్కారం లేని బార్‌కోడ్‌తో భవిష్యత్తులో వివాదాలు తలెత్తవని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ డి.రాజేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

➡️