భోగి మంటలతో అంగన్‌వాడీల నిరసన

అమలాపురంలోకలెక్టరేట్‌ ఎదుట భోగి మంట వేస్తున్న అంగన్‌వాడీలు, పాల్గొన్నకారెంవెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-యంత్రాంగం

డిమాండ్ల సాధన కోసం గత 34 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్‌వాడీల కొనసాగుతోంది. ఆదివారం జిల్లాలో అంగన్‌వాడీలు భోగిమంటలు వేసి నిరసన తెలిపారు. అమలాపురం సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివానం కలెక్టరేట్‌ ఎదుట భోగి మంటలు వేసి రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి పండగ ఘనంగా నిర్వహించుకుంటామని అలాంటి సంక్రాంతి పండగకు సీఎం జగన్‌ తమను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, పి.అమూల్య, విజయ, సుబ్బలక్ష్మి, పరిపూర్ణ, పార్వతి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా శిబిరం వద్ద భోగిమంట వేసి నిరసన తెలిపారు. జగనన్న మాకు పండగ దూరం చేసి ఆకలితో పస్తులు ఉంచాడని నినాదాలు చేపట్టారు. అనంతరం పలువురు అంగన్‌వాడీలుీ మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జిఒ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రమోషన్లలలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లకు వేతనాలు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, భీమా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయలి. ఆయిల్‌, కందిపప్పు క్వాంటిటీ పెంచాలన్నారు. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. సూపర్వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 33 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడిలు పాల్గొన్నారు.

 

➡️