భోగి మంటల్లో ఎస్మా ప్రతులు, షోకాజులు

Jan 14,2024 23:30

గుంటూరులో షోకాజ్‌ నోటీసులు దహనం చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-గుంటూరు :
వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో పండుగ రోజూ నిరసన తెలిపారు. భోగి సందర్భంగా సమ్మె శిబిరం వద్ద భోగి మంట వేశారు. ప్రభుత్వం అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జిఒ 2ను నిరశిస్తూ ఉత్తర్వుల ప్రతుల్ని భోగి మంటల్లో దహనం చేసి నిరసన తెలిపారు. సమ్మె శిబిరంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పాల్గొని అంగన్‌వాడీలకు మద్దతుగా మట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించి, అంగన్‌వాడీల పట్ల అత్యంత నియంతృత్వంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రభుత్వం ఇదే ధోరణి అవలంబిస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర తూర్పు, పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్న వెంకాయమ్మ, టి.రాధ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తుళ్లూరు, తాడికొండ : సమ్మె శిబిరాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలతో కలిసి చిన్నారులపై భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరాలకు అనుగుణంగా జీతాలు పెంచాలంటే డబ్బుల్లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. పైగా అంగన్వాడీలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సిఐటియు రాజధాని డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవి, ఎం.భాగ్యరాజు, సిఐటియు నాయకులు పి.బాబురావు, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణలత, కరీమున్‌, నాయకులు రజని, అన్నామణి, విజయలక్ష్మి, సునీత శంషాద్‌, తులసి, సరళ, మల్లీశ్వరి పాల్గొన్నారు. తాడికొండ పోలీస్‌స్టేషన్‌ శిబిరాన్ని రమాదేవి సందర్శించి సంఘీభావం తెలిపారు. గతంలో ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాలు తిరిగి అధికారం చేజిక్కించుకోలేదని, ఇది ఒక గుణపాఠం గా ఉంటుందని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులుసమ్మెకు మద్దతు తెలపడంతోపాటు ఎస్మా జీవోలను మంటల్లో దహనం చేశారు. ఎం.కోటేశ్వరరావు, గాంధీ రాంమోహనరావు, భాస్కరరావు, పూర్ణచంద్రరావు, గోపాలకృష్ణ, షరీఫ్‌, రఫీ, బాబు, అనిల్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదకాకాని రూరల్‌ : సమస్యలను పరిష్కరించకపోతే అందోళనను ఉధృతం చేస్తామని, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి రాష్ట్ర బంద్‌కు పూనుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన పెదకాకానిలో సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎస్మా జీవోలను అంగన్వాడీలతో కలిసి భోగి మంటల్లో దహనం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.శివాజీ, యూనియన్‌ నాయకురాలు కె.రాజ్యలక్ష్మి, పి.కనకవల్లి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : జిఒ 2 ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి.దుర్గారావు, సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వర్లు, సుందరయ్య సేవా సమితి కన్వీనర్‌ జి.సుబ్బారెడ్డి మాట్లాడారు. ఇ.దుర్గారావు, అంగన్‌వాడీలు మాధురి, వరలక్ష్మి, మాణిక్యం, లక్ష్మి, సుజాత, భవానీ, శ్రీదేవి, సరళ, తబిత పాల్గొన్నారు. అంగన్‌వాడీలకు సంఘీభావంగా రైతు సంఘం ఆధ్వ ర్యంలో ఉండవల్లి సెంటర్‌లో సంతకాలు సేకరించారు. సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు మాట్లాడారు. డి.వెంకటరెడ్డి, టి.జగదీశ్వరరెడ్డి, ఎస్‌కె పీరూ సాహెబ్‌, బక్కిరెడ్డి, రామారావు, పి.గాంధీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – దుగ్గిరాల, పెదనందిపాడు రూరల్‌ : ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. అంగన్వాడీలు, సిఐటియు నాయకులు సరస్వతి, జయ, నాగమణి, వెంకటేశ్వరమ్మ, జె.బాలరాజు, పోతురాజు, శివకుమారి కార్యదర్శి శ్రీదేవి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పొన్నూరు రూరల్‌ : సమ్మె శిబిరంలో భోగి మంటల్లో ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. నాయకులు ఎం.వి సుకన్య, డి.పద్మజ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చేబ్రోలు : సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి నాగేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. పోరాట నిధిగా రూ.3 వేలు అందించారు. అనంతరం ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌ హనుమంతరావు సమ్మె శిబిరాన్ని ప్రారంభించగా సుమలత, మంజూష, తిరుపతమ్మ, రమాదేవి పాల్గొన్నారు.ప్రజాశక్తి – తెనాలిరూరల్‌ : సమ్మె శిబిరాన్ని సిపిఎం, సిఐటియు నాయకులు బాబూప్రసాద్‌, హుస్సేన్‌వలి సందర్శించి మద్దతు తెలిపారు. పిల్లలకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటల్లో జీవో ప్రతులు, షోకాజ్‌ నోటీసులు దహనం చేశారు. నాయకులు పి.పావని, ఎవిఎన్‌ కు మారి, కె.జ్యోతి, విజ యలక్ష్మి, రాధా కుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంత కుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ సుఫియా పాల్గొన్నారు.

➡️