భోగి మంటల్లో జిఒ ప్రతులు దహనం

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 34వ రోజుకు చేరుకుంది. వై ఎస్‌ఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ జారీ చేసిన ఎస్మా జిఒ నంబర్‌ 2 ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. రైల్వేకోడూరు : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో, ఆదివారం భోగి పండుగ రోజూ అంగన్వాడీలు రోడ్డుపైనే, భోగి మంటలు వేసి, ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఎస్మా నోటీసులతో బెదిరించి, ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు, పి.జాన్‌ప్రసాద్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు అనుబంధం, ప్రాజెక్టు అధ్యక్షురాలు, ఎన్‌. రమాదేవి, కోశాధికారి. జి. పద్మావతి, ప్రసన్న,శిరీష, కుమారి, జై కుమారి, మునీంద్ర, సుజాత, సురేఖ, వాణి, రెడ్డమ్మ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం వద్ద 34వ రోజు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా ఎస్మా జిఒ ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు సుకుమారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే తాము మాత్రం వేతనాల పెంపునకు రోడ్డుపై ఉద్యమాలు చేసే దుస్థితి నెలకొందని వాపోయరు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు సుకుమారి ప్రాజెక్టు కార్యదర్శి ఓబులమ్మ సెక్టార్‌ లీడర్లు మరియు రామాపురం లక్కిరెడ్డిపల్లి గాలివీడు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఎస్మా జిఒ కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేసి 34 వరోజు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు హరింద్రనాథ్‌ శర్మ, నాయకులు మధురవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సమ్మెను నిర్వహిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని వాపోయారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి,అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️