మండపేట, ఏడిద గ్రామాల్లో లీగల్‌ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

Mar 12,2024 16:09 #Konaseema, #mandapeta

ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) :మండపేట, ఏడిద గ్రామాల్లో లీగల్‌ మెట్రాలజీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. రైతు బజార్‌ లోని ప్రతి దుకాణాన్ని తనిఖీ చేశారు. కాటా సీల్‌ తూకం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినియోగదారుల సమావేశంలో లీగల్‌ మెట్రాలజీ శాఖ జాయింట్‌ కంట్రోలర్‌ పి సుధాకర్‌ మాట్లాడుతూ.. వినియోగదారులకు ఖచ్చితమైన తూకం, వ్యాపార సంస్థలలో ఉపయోగించు కటాలు వాటి ముద్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఏడిద గ్రామంలో మాంసం విక్రయించే అమలదాసు లోవరాజు, పండ్లు విక్రయించే అనంతల వెంకటలక్ష్మి దుకాణాలలో ముద్రణలేని కాటా రాళ్లు వినియోగిస్తున్న నేపథ్యంలో వారి ఇరువురుపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కంట్రోలర్‌ రాజేష్‌ , రామచంద్రపురం డివిజనల్‌ ఇన్స్పెక్టర్‌ కుటుంబరావు, రైతు బజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ బోళ్ల సతీష్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

➡️