మధ్యాహ్న భోజన కార్మికుల వినతి

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంఇఒకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానిక ఎంఇఒ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికులు వినతిపత్రం అందజేశామన్నారు. కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాలని, మెనూ చార్జీలు రూ.20కి పెంచాలని, గ్యాస్‌ ఉచితంగా సరఫరా చేయాలని, రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మెటర్నిటీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, మట్టి ఖర్చులు, దహన సంస్కారాలకు ఇవ్వాలని, వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గౌరవాధ్యక్షులు ఎస్‌.తిరుపతిరెడ్డి, సంగిశెట్టి తిరుమలమ్మ, పి రమణమ్మ, సిహెచ్‌ ప్రసూన, ఎం చిన్నలక్ష్మమ్మ, షేక్‌ రసూల్‌, బి జయమ్మ, ఎస్తేరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️