మరోసారి ప్రభుత్వాన్ని ఆశీర్వాదించండి

Feb 3,2024 20:55

ప్రజాశక్తి – పూసపాటిరేగ : అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. శనివారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమా లకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపలను చేశారు. రెల్లివలసలో రూ. 45 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సుమారు రూ.30 లక్షలు అంచనాతో నిర్మించబోయే శ్మశాన వాటికతో పాటు ఎస్‌సి కాలనీలో రూ.25 లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. చల్లవానితోట, కుమిలి గ్రామాల్లో నిర్మించిన వెల్నెస్‌ సెంటర్లను ప్రారంభించారు. సిహెచ్‌అగ్రహారంలో శ్మశాన వాటికకు సుమారు రూ.22లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో సారి వైసిపిని గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వం వస్తే మన ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. ప్రారంభోత్స వాల్లో ఆయనతోపాటు ఎంపిపి మహంతి కళ్యాణి, వైస్‌ ఎంపిపిలు చంటిరాజు, అల్లాడ రమేష్‌, వైసిపి మండల అద్యక్షలు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనువాసరావు, మహంతి జనార్ధనరావు, రామతీర్ధ బోర్డు సభ్యులు డి. త్రినాదరావు, ఎఎంసి చైర్‌పర్సన్‌ చిక్కాల అరుణకుమారి, సర్పంచులు ఇజ్జురోతు అప్పలరాజు, మామిడి అప్పయ్యమ్మ, కొత్తకోట శ్రీరాములు, టొంపల సీతారాం, దేశెట్టి గణేష్‌, నాయకులు తాడిశెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు

➡️