మహాధర్నా జయప్రదానికి పిలుపు

Nov 25,2023 21:21
ఫొటో : కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ఫొటో : కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు
మహాధర్నా జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి ఇందుకూరుపేట : విజయవాడలో 27, 28 తేదీలలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని మండల సిఐటియు అధ్యక్షులు ఎస్‌.కె చాన్‌భాషా పిలుపునిచ్చారు. శనివారం ఇందుకూరుపేటలోని ఆటోస్టాండ్‌ వద్ద కరపత్రలాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయన్నారు. కనీస వేతనాలు ఉద్యోగ భద్రత రిటైర్‌మెంట్‌ బెనెఫిట్స్‌ ఏవీ లేకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగసంస్థలు రైల్వే, బ్యాంకులో ఎయిర్‌పోర్ట్స్‌ స్టీల్‌ ప్లాంట్‌లు, బ్యాంకులు సముద్ర మార్గాలు అన్ని అమ్మేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దొరికిన కాడికి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కార్మికులు, ఐక్యమై నవంబర్‌ విజయవాడలో జరిగే మహాధర్నాల జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ సభ్యులు నక్క నరసింహ, సీనయ్య, ఫయాజ్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️