మహిళలంటే జగన్‌కు ఎనలేని అభిమానం

Jan 28,2024 21:01

 ప్రజాశక్తి – డెంకాడ : మహిళలు అంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి అంతులేని అభిమానం అని వారి ఆర్థిక సంక్షేమానికి అనుగుణంగా నాలుగున్నర ఏళ్లుగా పలు పథకాల అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో వైయస్సార్‌ ఆసరా సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1190 సంఘాలు ఉండగా 12,457 మంది సభ్యులు ఉన్నారన్నారు. వీరికి ఆసరాల్లో భాగంగా నాలుగో విడతగా రూ.11.10 కోట్లు వారి ఖాతాల్లో వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వెలుగు పీడీ కళ్యాణ్‌ చక్రవర్తి, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, జెడ్‌పిటిసి బడుకొండ లక్ష్మి, తహశీల్దార్‌ పి. ఆదిలక్ష్మి, ఎంపిడిఒ డిడి స్వరూపరాణి, ఎపిఎం విజయలక్ష్మి, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, డ్వాక్రా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేపాడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతులు మీదుగా ఆసరా చెక్కును అందించారు. మరోసారి తనకు, సిఎం జగన్మోహన్‌రెడ్డికి మహిళలంతా ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️