మహిళల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి

ప్రజాశక్తి-పొదిలి: అన్ని రంగాల్లో మహిళలు అభివద్ధి చెందాలని తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వారికి పెద్దపీటవేస్తూ మహిళా పక్షపాతిగా నిలిచారని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి మరియు కొండేపి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆదివారం మర్రిపూడి వెలుగు కార్యాలయ ఆవరణలో వైయస్సార్‌ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సురేష్‌ మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాల పథకాలు నేరుగా వారి ఖాతాలకందిస్తూ మహిళా సాధికారితకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలకి పథకాలు అందిస్తే నేడు మన జగనన్న ప్రభుత్వం పార్టీల కతీతంగా, కుల, మతాలకతీతంగా పేదరిక నిర్మూల నే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథం లా భావించి 99% హామీలను ఈ జగనన్న ప్రభుత్వం అమలుపరిచిందనీ కొనియాడారు. మర్రిపూడి మండలం లోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. ప్రుదులగిరి లక్ష్మీనరసింహస్వామి కొండకు ఘాట్‌ రోడ్డు, గుండ్లసముద్రం మర్రిపూడి చెరువులకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వెలుగు పీడీ వసుంధర దేవి, ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ డి. మల్లికార్జున రావు, మర్రిపూడి, చిమట సొసైటీ చైర్మన్లు బివి భాస్కర్‌ రెడ్డి, మాకినేని వెంకటరావు, పార్టీ మాజీ కన్వీనర్లు ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, బోధ రమణారెడ్డి, భోగసముద్రం విజయభాస్కర్‌ రెడ్డి, మండల నాయకులు మాచేపల్లి నాగయ్య, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, మర్రిపూడి సర్పంచ్‌ కదిరి భాస్కరరావు, ధర్మవరం సర్పంచ్‌ గంగిరెడ్డి రమణారెడ్డి, ఇనుకొల్లు మాదిరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు కొండ్రు ఇజ్రాయిల్‌, వెలుగు ఏపీఎం బాబురావు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అంబటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️