మాట తప్పిన సిఎం

Dec 2,2023 21:01
నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు
మాట తప్పిన సిఎం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పారని సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ విమర్శించారు. మండలంలోని నరుకూరు సెంటర్‌ లోని జక్కా వెంకయ్య స్మారక సిఐటియు కార్యాలయంలో శనివారం అంగన్వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ సమావేశం జరిగింది. మండల కార్యదర్శి ఎస్‌.కె మస్తానమ్మ ఆధ్వర్యంలో జరిగిన మండల జనరల్‌ బాడీ సమావేశం లో ముఖ్య అతిథులుగా టివివి ప్రసాద్‌, మండల కార్యదర్శి మారుబోయిన రాజాలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసాద్‌ మాట్లాడుతూ సిఎం జగ న్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచార పాదయాత్రలో అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతానని ఇచ్చిన మాట తప్పారన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.రి టైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. అదేవిదంగా వేతనంలో సగం పెన్షన్‌ ఇ వ్వాలని సూచించారు. ఎఫ్‌.ఆర్‌.ఎస్‌ రద్దు చేయాలని, అన్ని యాప్‌లు కలిపి ఒకే యాప్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడి, ఆ యా కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలన్నారు. పెండింగ్‌ లో అంగన్వాడీ సెంటర్ల అద్దె లు, 2017 టీఏ బిల్లు లు ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు నా ణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని రాజా డిమాండ్‌ చేశారు. అలాగే ఫ్రీ స్కూల్స్‌ బలోపే తం చేయాలని అయన కోరారు. డిసెంబర్‌ 8వ తేదీ నుంచి అంగన్వాడి టీచర్లు హెల్పర్స్‌ న్యాయ మైన సమస్యల పరిష్కారం కోసం నిర్వ హించే సమ్మెను జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వా డి పేడూరు, టిపి గూడూరు, కోడూరు సెక్టార్‌ల నాయకులు అనిత, భాగ్యమ్మ, కవిత, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌, నరుకూరు సెంటర్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షులు నాశిన పరశురామ య్య, ఈపూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️