మానసిక క్షోభకు గురి చేయొద్దు : ముక్కాల

Dec 19,2023 20:23
మాట్లాడుతున్న ద్వారకానాథ్‌

మాట్లాడుతున్న ద్వారకానాథ్‌
మానసిక క్షోభకు గురి చేయొద్దు : ముక్కాల
ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్‌డ్రగ్స్‌ కేసులో తన కుమారుడిని తన స్నేహితుల్ని అరెస్టు చేశారని పుకార్లు చేసి తతను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఛైర్మన్‌ ముక్కల ద్వారకానాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత శనివారం ద్వారకనాథ్‌ కుమారుడు తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లగా అక్కడ ఒక సర్వీస్‌ అపార్ట్మెంట్లో లాంచ్‌ అయ్యారు. పోలీసులు తనిఖీలు చేయగా డ్రగ్స్‌ తీసుకున్నారన్న అనుమానంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై మంగళవారం వైసిపి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ముక్కాల ద్వారకానాథ్‌ మాట్లాడారు. తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా సరదాగా తన స్నేహితులతో కలిసి సర్వీస్‌ అపార్ట్మెంట్లో దిగారన్నారు. అక్కడి పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వారిని విచారణకు పిలిచారన్నారు. స్టేషన్లో శనివారం అన్ని ట్రస్టులు చేసి సోమవారం రిపోర్టులు కోసం రమ్మన్నారన్నారు. ఆ రిపోర్టులలో అన్ని నెగిటివ్‌ గానే వచ్చాయని, వారికి డ్రగ్స్‌తో ఎటువంటి సంబంధం లేదని ఇంటికి పంపించారన్నారు. గుడ్డ కాల్చి కాల్చి ముఖాన వేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఇలాంటి నిరాధారమైనవి తీసుకొచ్చి అప్రతిష్టపాలు చేయాలనుకుంటే పొరపాటు అవుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. తమ పరువును అప్రతిష్టపాలు చేసినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి నిజమైన కార్యకర్తగా విధేయత చూపుతాననన్నారు.

➡️