మాపై ఇంత కక్షసాధింపు ఎందుకు?

వినుకొండ శిబిరంలో మద్దతు తెలుపుతున్న టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 32వ రోజుకు చేరుకుంది. స్థానిక తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో ముగ్గుల పోటీలతో వినూత్న నిరసన తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేయితలుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కార్యదర్శి జి.ఉమాశ్రీ, నాయకులు ఐ.అరుణ, కె.సుధా వ్యవహరించారు. ప్రథమ స్థానంలో అరుణ, ద్వితీయ స్థానంలో మహాలక్ష్మి, తృతీయ స్థానంలో స్వర్ణ నిలవగా బహుమతులు ప్రదానం చేశారు. శిబిరం వద్ద భోగి మంటలేసి నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, ఐద్వా నాయకులు ఎ.శ్రావణి, ప్రశాంతి, అంగన్వాడి సత్తెనపల్లి ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు జి.సుజాత, ఎం.అహల్య, నాయకులు ధనలక్ష్మి, చాముండేశ్వరి, జ్యోతి, అంజలి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : సురేష్‌ మాల్‌ రోడ్డులోని అంగన్వాడి సమ్మె శిబిరం కొనసాగుతోంది. శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే, టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. అంగన్వాడీల సేవలు అమూల్యమైనవని, అందుకే వారికి పార్టీలకతీతంగా మద్దతు లభిస్తోందని చెప్పారు. వారి సమస్యను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా అంగన్వాడీలకు యుటిఎఫ్‌, ఎస్‌టిఎఫ్‌, ఎపిటిఎఫ్‌ తదితర ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, నాయకులు శివరామకృష్ణ, ఎ.ఆంజనేయులు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, బెజవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు బిబి నాగేశ్వరరావు, వెంకాయమ్మ, వి.చంద్రమౌళి, అంగన్వాడీ నాయకులు పి.ఉమాశంకరి, నిర్మల, సిహెచ్‌.గాయత్రి, డి.బీబీలు నాగజ్యోతి, బి.శ్రీదేవి, జి.పద్మ, జె.పద్మావతి, హరిత, కృష్ణకుమారి, ఎఎల్‌ ప్రసన్న పాల్గొన్నారు.
ప్రజాశక్తి – అమరావతి : అంగనవాడీలపై ప్రభుత్వానికి ఇంత కక్షసాధింపు ఎందుకని సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు ప్రశ్నించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వద్ద సమ్మె శిబిరంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని కోరడం తప్పా అని అన్నారు. నిత్యం అక్క చెల్లెమ్మలు అని మాట్లాడే సిఎం అంగన్వాడీలను ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు.
ప్రజాశక్తి – మాచర్ల : తాము గొంతెమ్మ కొర్కెలేమీ కోరటం లేదని, సుప్రీమ్‌కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనాలు ఇవ్వాలని, గ్రాట్యూటీ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరుతున్నామని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఉషారాణి అన్నారు. పట్టణంలోని సమ్మె శిబిరంలో అంగన్వాడీల నిరసన కొనసాగింది. శిబిరాన్ని ఉపారాణి ప్రారంభించి మాట్లాడారు. ఇందిర, కె.పద్మావతి, శాంతలత, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగుతోంది. కోటి సంతకాలు సేకరించి సిఎంకు అందించాలని అంగన్వాడీలు నిర్ణయించారు. దీనిలో భాగంగా తమ సెంటర్‌ పరిధిలోని పెద్దలు, మేధావులు, ప్రజానీకంతో సంతకాల సేకరణకు సిద్ధమయ్యారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాస్‌రావు, అంగన్వాడి నాయకులు ఎస్కే హజ్ర, డి.శాంతమణి, శివరంజని, అరుణ, వాణి, రమణ, బుజ్జి, జయకుమారి, స్వప్న, అన్నమ్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక శాఖ గ్రంథాలయం వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. పలువురు అంగన్వాడీలు దీక్షల్లో కూర్చోగా వీరికి యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి. సావిత్రి పూలమాలలేసి దీక్షలను ప్రారంభించారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. సమ్మె శిబిరాన్ని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. సిఎం సానుకూలంగా స్పందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఇదే అంగన్వాడీలు ఇంటికి పంపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.విల్సన్‌, ఎస్‌.బాబు, షేక్‌ అల్లాభక్షు పాల్గ్నొఆ్నరు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద సమ్మె రోజు 32వ సంఖ్య వేసి నిరసన తెలిపారు.
ప్రజాశక్తి – క్రోసూరు : సమ్మె శిబిరం కొనసాగుతోంది. వీరికి సంఘీభావంగా స్థానిక ఆమంచి విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడారు.

➡️