మాయాప్‌ సంస్థపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ బలహీనతను అవకాశంగా మలుచుకొని యాప్‌ల పేరుతో సైబర్‌ నేరస్తులు అమాయకులను దోచేస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఆశను అవకాశంగా మార్చుకొని రూ.కోట్లల్లో నగదు దోచుకుంటున్నారు. మాయాప్‌లో పెట్టుబడులు పెట్టండి మీ సొమ్ము కొన్ని రోజుల్లోనే రెట్టింపు అవుతుందని నమ్మించారు. బాధితులు రూ.కోట్లు పెట్టిన వెంటనే బోర్డు తిప్పేశారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని సుండుపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటననే ఇందుకు నిదర్శనం. గురువారం ఎస్‌టిఐసి అనే యాప్‌ పనిచేయకపోవడంతో బాధితులు రాయచోటి రూరల్‌ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ సుండుపల్లి కేంద్రంగా ఎస్‌టిఐసి యాప్‌ పేరుతో సైమన్‌ అనే వేక్తి కార్యాలయం ఓపెన్‌ చేసి అమాయకులను నమ్మబలికి కార్యకలాపాలు సాగించి బోర్డు తిప్పేసారని పేర్కొన్నారు. సైమన్‌ అనే వేక్తి గతంలో సస్పెన్షన్‌కు గురైన ఎఆర్‌ కానిస్టేబుల్‌ సోదరుడని తెలిపారు. మోసపోయామని గ్రహించి తమకు న్యాయం చేయాలంటూ ఎస్‌పి కార్యాలయానికి 30 మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి రావడంతో రూరల్‌ సిఐ తులసీరామ్‌కు అప్పగించారు. నాయ్యం కోసం బాధితులు రాయచోటి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు క్యూ కట్ట్యారు. అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాలకు చెంది బాధితులు ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా బాధితులు ఉంటారని బాధితులు అంటున్నారు. ప్రయివేట్‌ యాప్‌ల పేరుతో కేటుగాళ్లు ప్రజలను లూటీ చేస్తున్నరని రెట్టింపు సొమ్ము వస్తుందని ఆశ చూపి రూ.కోట్లు స్వాహా అవు తాయని సిఐ తెలిపారు. యాప్‌ మాయగాలను నమ్మి ప్రజలు ఎవరు మోసపోకూడదన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

➡️