మార్కెట్‌ ధరకే కందులు కొనుగోలు : వ్యవసాయ అధికారి జయలక్ష్మి

Jan 7,2024 16:25 #Kurnool

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ మార్కెట్‌ లలో నిర్ణయించిన ధరలకే కందులను నాఫెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు కందులు విక్రయించుకోవచ్చు అన్నారు. ధాన్యం అమ్మే సమయంలో రైతు యొక్క ఆధార్‌ కార్డు బ్యాంకు పాస్‌ పుస్తకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ధాన్యం పట్టిన వారం రోజుల లోపల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. గోనె సంచులు, రవాణా చార్జీలు కూడా ఉచితమన్నారు. ఈ అవకాశాన్ని కందులు వేసుకున్న ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఈఓ రమాదేవి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌ పాల్గొన్నారు.

➡️