మార్పు కనపడేలా ఏకాగ్రతతో పనిచేయాలి

పల్నాడు జిల్లా: జిల్లాలో వినూనత్నంగా చేపట్టిన గ్రామోదయం, నగరోదయం కార్య క్రమంలో మండల ప్రత్యేక అధికారులు గుర్తించిన పనులపై తగిన ఉత్తర్వులు జారీచేసి పనులు త్వరితగతిన పూర్త య్యేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సం బంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలములోని వీడి యో కాన్ఫరెన్స్‌ హాలు నుండి మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ప Ûరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మండల ప్రత్యేక అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటెషన్‌ ద్వారా వారు గుర్తించిన అంశాలను వివరించారు. కుల గణన ప్రక్రియ ఎలా జరుగు తుందని ఆన్‌లైన్‌ అప్‌డేషన్‌ వేగవంతం చేయాలని, వికలాంగ ఓటరు నమోదు, బంగారుతల్లి, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఆయుష్మాన్‌ భారత్‌ పిఎం జన ఆరోగ్య యోజన వంటి, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలపై సమీక్షించారు. అదే విధంగా రానున్న ఎన్నికల దృష్ట్యా అవసరమైన పాఠశాలలో మౌలిక వసతులు, ర్యాంపులు వంటి పనులు (ఎయంయఫ్‌) పూర్తి చేయా లన్నారు. అంగన్‌ వాడీ వర్క్ట్ల విధులలో చేరే విధంగా చర్యలు చేపట్టా లన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఒపి పెంచాలని సూచించారు. గ్రామోదయం, నగరోదయం కార్య క్రమం ద్వారా మార్పు కనపడే విధంగా అది óకారులు ఏకాగ్రతతో పని చేయాలని ఆదేశించారు. 22న ఓటర్ల జాబితా వెల్లడిరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రత్యేక సారాంశ సవరణ-2024 పై అమరావతి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో స్థానిక నరసరావుపేట కలెక్టర్‌ కార్యా లయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి పాల్గొన్నారు.

ప్రధాన ఎన్నికల అధికారి సూచనలను, సలహాలను పాటించి విధులు నిర్వహించడం జరుగు తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కలెక్టర్‌ వివరించారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందిని భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిబ్రవరి- 1 నుండి 10వ తేదీ లోగా పూర్తి చేయడం జరుగుతుందని, జనవరి 22న ఓటర్ల జాబితాను వెల్లడించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ లో,అవసరమైన ప్రధాన కూడళ్ళలో కూడా ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. కార్య క్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె. వినాయకం, నరస రావుపేట ఆర్డీఓ ఎం. శేషిరెడ్డి, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా కులగణన సర్వే

పిడుగురాళ్ల: పగడ్బందీగా పల్నాడు జిల్లాలో కుల గణన సర్వే పారదర్శకంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సూచించారు. శుక్ర వారం పట్టణం లోని 21 వార్డు, దాచేపల్లి పట్టణంలోని 9 వార్డుల్లో జరుగుతున్న కులగణనలపై సంబంధిత జిల్లా అధికారులతో, సచివాలయ సిబ్బం దితో మాటా ్లడారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కులగణన సర్వే సున్నితమైన అంశమని, అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొని పారదర్శకంగా పూర్తి చేయాలని చెప్పారు. సర్వే ద్వారా కులాల వివరాలు, నివాసంలో ఎంతమంది ఉంటున్నారనేది సచివాలయ సిబ్బంది రూట్‌ మ్యాప్‌ ప్రకారం వివరాలు సేకరిస్తారన్నారు. అనంతరం బయో మెట్రిక్‌ ద్వారా ఆ కుటుంబంలో ఇంటి పెద్ద అథెంటికేషన్‌ తీసుకుంటారని అన్నారు. ఈ నెల 28 నాటికి ఈ సర్వేను పూర్తి చేయాలని, అధి కారులకు సూచించారు. సర్వేలో స్పెషల్‌ ఆఫీసర్‌, తహ శీల్దార్‌, ఎంపీడీవో, కమిషనర్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

➡️