మా జీతాలు మాకివ్వండి

Dec 26,2023 21:18

ప్రజాశక్తి-చీపురుపల్లి: ‘మా జీతాలు మాకివ్వండి, ప్రతీ రోజు ఉదయం మూడు గంటలకు మేము లేచి పంచాయతీలో పారిశుధ్య పనులు చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. మా పిల్లా పాపలతో మేము ఏం తిని బతకాలి? ఇది న్యాయమేనా,? ఎందుకు మమ్మల్ని ఇంత చులకనగా చూస్తున్నారు’ అంటూ చీపురుపల్లి పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్మికులు గత రెండు రోజులుగా తమకు రావలసిన ఏడు నెలల జీతం చెల్లించాలంటూ పారిశుధ్య పనులకు దూరంగా ఉంటు న్నారు. తమకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే తామెలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఎలా చదివించాలంటూ ఆందోళన చెందుతున్నారు. ఏడు నెలలో కనీసం ఐదు నెలలైనా తమకు జీతాలు అందించాలని గత రెండు నెలల నుండి కోరుతున్నప్పటికీ అధికారులెవరూ స్పందించడం లేదని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు చెల్లించలేనందును రెండు రోజుల నుండి తాము పారిశుధ్య పనులకు దూరంగా ఉంటున్నామని తమ సమస్యల పరిష్కరించకుంటే తమ యూనియన్లతో చర్చించి సమ్మెలోనికి దిగుతామని పారిశుధ్య కార్మికులు సంఘం ప్రతినిధులు నీలాపు కనకరాజు, రౌతుయ పైడిరాజు, దనాల సన్నితో పాటు పలువురు కార్మికులు హెచ్చరించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని లేదంటే ఉద్యమానికి సిధ్దం అని వారు తెలిపారు.నాలుగు నెలల జీతం అందించేందుకు ఏర్పాట్లుపారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన వేతనంలో నాలుగు నెలల జీతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పారిశుధ్య కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.- ఇఒ వై ఝాన్సీ

➡️