మిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-కాజులూరు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి నర్ల ఈశ్వరి డిమాండ్‌ చేశారు. గురువారం కాజులూరు వేగుళ్లమ్మ ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి వచ్చాక పాదయాత్రలో మిడ్డే మీల్స్‌ వర్కర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాజబాబు మాట్లాడుతూ ఇప్పటికే ఐదో సంవత్సరం జరుగుతున్నా సమస్యలు పరిష్కరించలేదన్నారు. సమస్యలపై జనవరిలో విజయవాడలో చేపట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా తాళ్లపూడి రాజ్యలక్ష్మి, కార్యదర్శిగా యాళ్ల అరుణ, సహాయ కార్యదర్శిగా ముద్రగడ విజయలక్ష్మి, పి.శేషారత్నం, కట్టా సత్యవేణి, నేరేడుమిల్లి సుబ్బలక్ష్మి, తిరగట్టి సత్యవతి, పులుగు కుంతీదేవి, కామేశ్వరి పాల్గొన్నారు.

➡️