మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

Feb 26,2024 21:39

ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను సిఐటియు జిల్లా ఫ్రధాన కార్యదర్శి కె.సురేష్‌, మిమ్స్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ కోరారు. సోమవారం గరివిడిలో తన క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి వినతి అందజేశారు. మిమ్స్‌ ఉద్యోగుల, కార్మికుల సమస్యలను వివరించారు. మిమ్స్‌ యాజమాన్యం గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగులు,కార్మికుల పట్ల నియంతత్వ వ్యవహరించి 7డిఎలు ఇవ్వలేదని, వేతన ఒప్పందం చేయలేదని తెలిపారు. సమస్యలపై యాజమాన్యాన్ని అడిగితే సస్పెన్షన్లు, కక్ష సాధింపులు చేసి బదిలీలు, బెదిరింపులు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ందోళన చేస్తున్నారని వివరించారు. యినా యాజమాన్యం పట్టించుకోకుండా దొంగ చాటుగా వేరే వారితో చర్చలు జరిపడమే కాకుండా కార్మిక శాఖా అధికారులు కూడా యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ మిమ్స్‌ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు ఎం.నారాయణ రావు, గౌరీ, కామునాయుడు, రాంబాబు, మధు, వరలక్ష్మి, బంగారు నాయుడు, తదితరులు ఉన్నారు.

➡️