మిమ్స్‌..మొండి వైఖరి విడనాడాలి

Feb 29,2024 21:21

ప్రజాశక్తి- నెల్లిమర్ల  : మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి విడనాడిి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ హెచ్చరించారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం డిఎ బకాయిలు చెల్లించాలని, వేతన ఒప్పందం చేయాలని, సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి జిల్లా కార్మికులు, ప్రజల మద్దతు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌, ఉద్యోగులు మిరప నారాయణ, కాము నాయుడు, నాగభూషణం, అప్పలనాయుడు, మధు, మూర్తి, రాంబాబు, బంగారు నాయుడు, గౌరీ, వరలక్ష్మి, రామకృష్ణ, బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️